'బంగారు బుల్లోడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,January 13,2021 - 03:48 by Z_CLU

అల్ల‌రి న‌రేష్ హీరోగా గిరి పి. ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బంగారు బుల్లోడు’. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా పూజా ఝ‌వేరి న‌టించిన‌ ఈ చిత్రానికి సంబంధించి అన్ని ప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.

ప్రేక్ష‌కుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, జ‌న‌వ‌రి 23న‌ ‘బంగారు బుల్లోడు’ను విడుద‌ల చేస్తున్న‌ట్లు లేటెస్ట్ పోస్ట‌ర్ ద్వారా చిత్ర‌ బృందం ప్ర‌క‌టించింది. హీరోయిన్ పూజా ఝ‌వేరి స్కూట‌ర్‌పై వెళ్తుంటే, వెనుక హీరో న‌రేష్ త‌న బృందంతో హుషారుగా పాట పాడుతూ ఆమె వెంట ప‌డుతున్న‌ట్లు ఆ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌ల‌న్నింటినీ రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు.

అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో ఓ చ‌క్క‌ని హాస్య‌భ‌రిత చిత్రంగా ‘బంగారు బుల్లోడు’ పేరు తెచ్చుకుంటుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. టాలీవుడ్‌లోని ప‌లువురు పేరుపొందిన హాస్య‌న‌టులు ఈ చిత్రంలో న‌టించార‌నీ, వారిపై చిత్రీక‌రించిన ప‌లు స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను క‌డుపుబ్బ న‌వ్వుకునేలా చేస్తాయ‌నీ వారు చెప్పారు.