పాటలతో ప్రారంభంకానున్న బంగార్రాజు?

Wednesday,January 29,2020 - 01:03 by Z_CLU

ఎట్టకేలకు బంగార్రాజు ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చింది. దర్శకుడు కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ-స్క్రీన్ ప్లే ను నాగార్జున లాక్ చేయడంతో, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్ మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

బంగార్రాజు ప్రాజెక్టుకు సంబంధించి 2 పాటల్ని ఫైనలైజ్ చేశారంట. కుదిరితే ఈ పాటలతోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ షూట్ కంప్లీట్ అయిన వెంటనే బంగార్రాజు సెట్స్ పైకి వస్తుంది.

నాగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది సోగ్గాడే చిన్ని నాయనా మూవీ. ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర అంటే నాగ్ కు చాలా ఇష్టం. ఆ పాత్ర ఆధారంగా ఇప్పుడు మరో ఫుల్ లెంగ్త్ మూవీ సిద్ధం చేశాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. సోగ్గాడే సినిమాకు ఇది సీక్వెల్ కాదు, అలా అని ప్రీక్వెల్ కూడా కాదు. కేవలం ఆ సినిమాలో పాత్రను మాత్రమే వాడుకుంటున్నారు.