కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తా- బండ్ల గణేశ్

Thursday,July 09,2020 - 12:13 by Z_CLU

కరోనా సోకడానికి ముందు కరోనా నుంచి బయటపడిన తర్వాత అన్నట్టుగా తన జీవితాన్ని చూడొచ్చంటున్నాడు నటుడు నిర్మాత బండ్ల గణేశ్. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న ఈ నటుడు, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని వివాదాలకు దూరంగా హ్యాపీగా గడుపుతానంటున్నాడు.

అంతేకాదు.. ఇకపై ఇండస్ట్రీలో తనకు నచ్చినట్టు సినిమాలు చేస్తానని, కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తానని చెబుతున్నాడు బండ్ల.

“ఇన్నాళ్లూ స్టార్ హీరోలతో సినిమాలు తీశాను. ఇకపై నాకు నచ్చినట్టు తీస్తా. కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేస్తా. ఆల్రెడీ 8 కథలు విన్నాను. ఒకటి ఫైనల్ చేశాను. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా”

ఇలా తన ఫ్యూచర్ కెరీర్ ను బయటపెట్టాడు బండ్ల గణేశ్. ఇకపై కామెడీ పాత్రలు చేయనని, గుండెలు పిండేసే బలమైన క్యారెక్టర్స్ మాత్రమే చేస్తానంటున్న ఈ నటుడు.. మరో 5-6 ఏళ్లలో తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తానంటున్నాడు.