ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన బండ్ల గణేష్

Monday,August 05,2019 - 05:48 by Z_CLU

ఈమధ్య కాలంలో దాదాపు సినిమాలకు దూరమయ్యాడు బండ్ల గణేష్. రాజకీయాల్లో లక్ చెక్ చేసుకున్న ఈ నటుడు, షార్ట్ గ్యాప్ లోనే పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు మరోసారి సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఇందులో భాగంగా మహేష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బండ్ల, ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చాడు.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ పైకి బండ్ల గణేశ్ వచ్చాడు. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ముఖానికి రంగేసుకున్నాడు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ట్రైన్ సెట్ లో బండ్ల గణేశ్ పై కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు.

ఇదే సినిమాతో ఒకప్పటి హీరోయిన్ విజయ్ శాంతి కూడా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో విజయశాంతి రోల్ ఎమోషనల్ గా ఉంటే, బండ్ల గణేశ్ క్యారెక్టర్ కామిక్ టచ్ తో ఉంటుందట. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.