Bandla Ganesh - హీరోగా మారుతున్న ప్రొడ్యూసర్

Wednesday,April 28,2021 - 02:43 by Z_CLU

కొన్ని సినిమాలు చూసిన వెంటనే దీన్ని ఉన్నపళంగా మన భాషలో రీమేక్ చేయాలనిపిస్తుంటుంది. ప్రస్తుతం తమిళ్ లో ఓ సినిమా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ రీమేక్ చేయాలనే కోరిక కలిగిస్తుంది. ఆ సినిమానే ‘మండేలా’. చిన్న బడ్జెట్ తో కమెడియన్ యోగిబాబు మెయిన్ లీడ్ చేసిన ఈ సినిమా ఇటివలే OTT లో విడుదలైంది. చూసిన వారందరినీ ఆకర్షిస్తూ మంచి సినిమా అనుపించుకుంటుంది. లోకల్ రాజకీయాల నేపథ్యంతో మంచి సందేశాత్మక సినిమాగా రూపొందిన ఈ సినిమాను సెలెబ్రిటీలు సైతం మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడట బండ్ల గణేష్. తాజాగా ఈ రీమేక్ కోసం ఒరిజినల్ మేకర్స్ ని గణేష్ సంప్రదించాడని అంటున్నారు.

bandla ganesh mandela telugu remake 2

అయితే కేవలం ఈ రీమేక్ సినిమాను నిర్మించడమే కాకుండా తనే హీరోగా నటించాలని భావిస్తున్నాడట. తమిళ్ లో కమెడియనే హీరోగా చేశాడు కాబట్టి ఈ కథకి నువ్వే యాప్ట్ అంటూ కొందరు బండ్ల కి సలహా ఇచ్చారట. ప్రస్తుతానికి రీమేక్ రైట్స్ తీసుకునే పనిలో బిజీగా ఉన్నాడు గణేష్.  డైరెక్టర్ ఎవరనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. తనే హీరోగా చేస్తాడా లేదా మరో కమెడియన్ ని పెట్టి సినిమా తీస్తాడా ? అనేది తెలియాల్సి ఉంది.

ఇటివలే కోవిడ్ సెకండ్ వేవ్ తో మళ్ళీ ఎఫెక్ట్ అయిన బండ్ల గణేష్ పూర్తిగా కోలుకున్నాడు. ఇక కరోన ఎఫెక్ట్ తగ్గాక తన బేనర్ లో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో మండేలా రీమేక్ ఒకటి కానుంది.

ఈ రీమేక్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics