Bandla Ganesh - హీరోగా మారిన కమెడియన్

Friday,August 20,2021 - 04:26 by Z_CLU

కమెడియన్లు హీరోలుగా మారడం టాలీవుడ్ లో అనాదిగా వస్తోంది. పాతకాలంలో రాజబాబు, పద్మనాభం లాంటి వాళ్లు హీరోలుగా కూడా నటించారు. ఆ తర్వాత అలీ, బ్రహ్మానందం లాంటి హాస్యనటులు కూడా హీరోలుగా మారారు. ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ నుంచి సప్తగిరి వరకు చాలామంది ఈ లిస్ట్ లోకి వస్తారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బండ్ల గణేష్ కూడా చేరిపోయారు.

హాస్యనటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా మారుతున్నారు. ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.‌ వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

తమిళంలో ఆర్. పార్తిబన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది. పార్తిబన్ గారికి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి.‌ ఇప్పుడీ సినిమా రీమేక్ లో బండ్ల గణేష్ నటిస్తున్నారు..

హిందీలో ఈ సినిమాను అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చెన్నైలో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగు రీమేక్ లో బండ్ల హీరోగా నటించబోతున్నారు. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారట బండ్ల గణేష్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics