సమయం లేదు... రణమే...

Monday,November 21,2016 - 01:10 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి యుద్ధం ముగిసింది. టాకీ పార్ట్ కూడా పూర్తయింది. బ్యూటీఫుల్ లొకేషన్స్ లో పాటలు తెరకెక్కించడం కూడా అయిపోయింది. మొత్తానికి డైరెక్టర్ క్రిష్ ప్లాన్ చేసుకున్నట్టు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది గౌతమీపుత్ర శాతకర్ణీ. కేవలం ఒకే ఒక్క రోజు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.

బాలయ్య కరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణీకి చిరాంతన్ భట్ సంగీతం అందించాడు. ప్రస్తుతానికి డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ, తిరుపతిలోనే ఆడియో రిలీజ్ చేస్తామని ప్రకటించింది సినిమా యూనిట్. ఇక రేపటి నుండి ఫుల్ టైం పోస్ట్ ప్రొడక్షన్ కోసం ల్యాబ్ కి షిఫ్ట్ కానున్న GPS సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.