#Balayya107... కాంబో ఫిక్స్?

Friday,July 31,2020 - 01:50 by Z_CLU

బాలయ్య కోసం అమధ్య ‘రామారావు’ అనే టైటిల్ తో కథ రెడీ చేశాడు అనిల్ రావిపూడి. కానీ అది సెట్ అవ్వలేదు. దీంతో ఈ కాంబోలో మూవీ ఆలస్యమైంది. ఇప్పుడు ఎట్టకేలకు మళ్ళీ ఈ కాంబో #Balayya107 కోసం కలుస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత చేయబోయే సినిమా గురించి బాలయ్య కొందరు దర్శకులతో డిస్కర్షన్స్ మొదలు పెట్టాడట. ఇటివలే బాలయ్య కోసం ఓ కథ రాసి ఫోన్ ద్వారా వినిపించాడట అనిల్ రావిపూడి.

పాయింట్ నచ్చడంతో అనిల్ చెప్పిన కథకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో వరుసగా బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేస్తున్న అనిల్ రావిపూడి బాలయ్య ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో ఎలాంటి కథతో సినిమా తీస్తాడో ఆసక్తి రేకెత్తిస్తుంది.

ప్రస్తుతం వర్క్ చేస్తున్న F3 సినిమా కంటే ముందే బాలయ్యతో సినిమా ఉండొచ్చని టాక్ నడుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది.