బాలయ్య షాక్ ఇచ్చాడు...

Saturday,February 25,2017 - 11:04 by Z_CLU

నటసింహం నందమూరి బాలయ్య ఉన్నట్టుండి షాక్ ఇచ్చాడు… లేటెస్ట్ గా ప్రతిష్టాత్మక 100 వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ తో గ్రాండ్ హిట్ అందుకున్న బాలయ్య ఈ సినిమా తరవాత కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కి బిగ్ బీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ సినిమాను పక్కనపెట్టి ఇతర కథలపై దృష్టి పెట్టాడు..

ఇప్పటికే 101 సినిమా కోసం కథలు వింటూ త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ చేస్తాడనుకున్న ఫాన్స్ కి ఉన్నట్టుండి పూరి తో సినిమాను ఫైనల్ చేసి  షాక్ ఇచ్చాడు బాలయ్య.  ఇటీవలే ఈ ఊహించని కాంబినేషన్ ను సెట్ చేసుకొని అభిమానులను మరోసారి  డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతుంది..మరి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, డిఫరెంట్ హీరోయిజం చూపించే పూరి బాలయ్య ను ఈ సినిమాతో ఎలా చూపించబోతున్నాడా.. అనే డౌట్స్ అందరిలో మొదలయ్యాయి.