దూసుకొస్తున్న 'శాతకర్ణి'

Tuesday,October 04,2016 - 03:09 by Z_CLU

 నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.

ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేయగా మరో లుక్ ను దుర్గాష్టమి సందర్బంగా ఈనెల 9న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఈ చిత్ర టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు దసరా కానుకగా ఆ బహుమతిని కూడా అందించడానికి డిసైడ్ అయ్యాడట నందమూరి నట సింహం.

gautami-putra-shatakarni

ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను విజయ దశమి సందర్భంగా ఉదయం 8 గంటలకు విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్ . ఈ రెండు ముహూర్తాలను బాలయ్యే ఖరారు చేసారని సమాచారం. మరి ఈ దసరా బాలయ్య అభిమానులకు పెద్ద పండగే…