

Tuesday,August 02,2016 - 05:14 by Z_CLU
క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాడు నటసింహం బాలయ్య. ఈ సినిమా యూనిట్ కు ప్రస్తుతం సెలవులు ప్రకటించాడు బాలకృష్ణ. ఎఁదుకంటే.. ఈనెలలో క్రిష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే ప్రస్తుతం ఎలాంటి షూటింగ్ లు పెట్టుకోవడం లేదు. అయితే శాతకర్ణి నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమౌతుందనే ఆత్రుత మాత్రం నందమూరి అభిమానుల్లో ఉంది. తన వందో సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ బయటపెట్టాడు బాలయ్య. తాజా సమాచారం ప్రకారం… సెప్టెంబర్ 1 నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి తాజా షెడ్యూల్ ప్రారంభమౌతుంది. అంటే సరిగ్గా నెల రోజుల తర్వాత కొత్త షెడ్యూల్ మొదలవుతుందన్నమాట. మధ్యప్రదేశ్ లో ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభమౌతుందంటూ వార్తలు వస్తున్నాయి. కథ ప్రకారం… మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు షూటింగ్ కు అనువుగా ఉంటాయని యూనిట్ భావించడంతో… ఆ రాష్ట్రంలోనే షూటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Wednesday,March 16,2022 04:06 by Z_CLU
Wednesday,February 23,2022 12:00 by Z_CLU
Sunday,February 20,2022 04:11 by Z_CLU
Tuesday,January 25,2022 03:46 by Z_CLU