జెట్ స్పీడ్ తో బాలయ్య

Sunday,December 17,2017 - 01:38 by Z_CLU

ఈ ఏడాది ఆరంభంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాతో థియేటర్స్ లో హంగామా చేసిన బాలయ్య ఇటీవలే ‘పైసా వసూల్’ అంటూ మరో సినిమాతో సందడి చేశాడు. ఈ ఏడాది హీరోగా రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేసిన బాలయ్య నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘జై సింహ’ సినిమాను ఫినిష్ చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్న బాలయ్య ఫిబ్రవరి నుంచి మరో సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఎస్.వి.కృష్ణరెడ్డి తో పాటు అనిల్ రావిపూడి పేరు కూడా వినిపిస్తుంది. దర్శకుడెవరై నప్పటికీ బాలయ్య నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా రెండు సినిమాలు పక్కా అంటున్నారు బాలయ్య సన్నిహితులు.