ఎన్టీఆర్ బయోపిక్.. టీజర్ రెడీ చేస్తున్న బాలయ్య ?

Sunday,December 24,2017 - 11:00 by Z_CLU

లేటెస్ట్ గా ‘జై సింహ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నందమూరి నటసింహం బాలయ్య నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు. తన 103 సినిమాను తేజ డైరెక్షన్ లో చేయబోతున్న బాలయ్య.. ఈ సినిమాకు సంబంధించి టీజర్ తో అభిమానుల్లో జోష్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ముందుగా టీజర్ షూట్ చేయబోతున్నారట యూనిట్. ఈ నెల 28న ఈ టీజర్ కి సంబంధించి బాలయ్య పై కొన్ని షాట్స్ తీసే ఆలోచనలో ఉన్నారట. మూడు రోజుల పాటు ఈ షూటింగ్ జరగనుందని సమాచారం. వచ్చే నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ టీజర్ ను రిలీజ్ చేసి టైటిల్ కూడా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సంక్రాంతి రేస్ లో జై సింహ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్న బాలయ్య జనవరిలో టీజర్ తో మరో సారి నందమూరి ఫాన్స్ ను ఖుషి చేయనున్నాడన్నమాట.