#NBK107 షూటింగ్ మొదలు పెట్టిన బాలయ్య

Friday,February 18,2022 - 03:47 by Z_CLU

#NBK107 Shoot commences today

నందమూరి బాలకృష్ణ , గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘NBK107’ సినిమా షూటింగ్ మొదలైంది. ఇటివలే లాంఛయిన ఈ సినిమా నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సిరిసిల్ల దగ్గర ఓ ఊరిలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. బాలయ్య తో పాటు మరికొందరు నటులు పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారు.

దాదాపు మూడు రోజుల పాటు ఈ సీక్వెన్స్ తీయనున్నారు. గోపీచంద్ మలినేని సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్స్ గా ఉంటాయి. క్రాక్ లో యాక్షన్ సీక్వెన్స్ ల గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు ఆడియన్స్. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా అలాంటి ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు దర్శకుడు.

బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దునియ విజయ్ విలన్ గా కనిపించనున్నాడు.  వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్  నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics