Balayya -Gopichand Malineni కాంబో రెడీ అవుతుంది !

Wednesday,February 24,2021 - 01:16 by Z_CLU

 బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ‘మోనార్క్’ సినిమా చేస్తున్న నందమూరి బాలక్రిష్ణ నెక్స్ట్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ కాంబో సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.  ఇటివలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమా షూటింగ్ కి ప్లాన్ రెడీ అవుతుంది. ఎప్పటికప్పుడు బాలయ్యతో చర్చిస్తూ వర్క్ చేస్తూ వెళ్తున్నాడు గోపీచంద్ మలినేని. త్వరలోనే తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టనున్నాడు.

తాజాగా బాలయ్యతో ఒక ఫోటో దిగిన గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా తమ కాంబోలో సినిమా రెడీ అవుతుందని చెప్పకనే చెప్పేశాడు. ‘క్రాక్’ తర్వాత నందమూరి నటసింహంను డైరెక్ట్ చేయనున్న గోపీచంద్ మలినేని  ఈ సినిమాతో మళ్ళీ ఎలాంటి హిట్ అందుకుంటాడో అని ఇప్పటి నుండే అంచనాలు మొదలవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు మిగతా క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు గోపీచంద్ మలినేని.