బాలయ్య ఫిలిం ఫెస్టివల్..

Monday,October 03,2016 - 01:31 by Z_CLU

 

బాలయ్య 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఈ లోపు అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. బాలయ్య సినిమాలంటేనే క్రియేటివిటీకి, హైప్ కి కేరాఫ్ అడ్రస్. అందుకే ఆయన శత  సినిమా సంబరాలను కూడా అంతే వినూత్నంగా, భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు.

 balayya

బాలయ్య 100 వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘ ఇంకా రిలీజ్ డేట్ కూడా ప్రకటించనే లేదు. అప్పుడే కడప జిల్లాలోని బాలయ్య అభిమానులు రోజుకు ఒక సినిమా చొప్పున వరసగా 99 రోజులు ఆయన సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ ని ఎంచుకున్నారు.

balayya-legend

బాలయ్య నటించిన చిత్రాలను చూడదలుచుకున్న వారు కేవలం 99 రూపాయలు చెల్లించి రోజుకో సినిమా చొప్పున అన్ని సినిమాలు చూడవచ్చు. అంటే కేవలం ఒక రూపాయికే ఒక సినిమా అన్న మాట. దీన్ని బట్టి బాలయ్యకి ఆయన అభిమానుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం అయిపోతుంది. ఇదిలా ఉంటే అర్చన థియేటర్ లో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న లెజెండ్ సినిమా 922 రోజు పూర్తిచేసుకుంది.