అఘోరగా బాలయ్య.. ప్రకటించిన బోయపాటి

Friday,May 01,2020 - 12:04 by Z_CLU

ప్రస్తుతం బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ షేడ్ లో బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నారనే రూమర్ చాన్నాళ్లుగా వినిపిస్తోంది.
అది రూమర్ కాదని, నిజమేనని ప్రకటించాడు బోయపాటి.

“బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నాడా అని చాలామంది అడుగుతున్నారు. అవును.. నిజమే బాలయ్య అఘోరాగా కనిపిస్తారు. కాకపోతే అతడి పాత్ర ప్రజెంటేషన్ మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. సింహా, లెజెండ్ తర్వాత ఎలాంటి పాత్రలో బాలయ్యను చూపించాలనే అంశంపై బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది.”

ఇలా కొత్త సినిమాలో ఓ షేడ్ లో బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నాడనే విషయాన్ని బయటపెట్టాడు బోయపాటి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. ఓ కీలకమైన ఎపిసోడ్ తో పాటు, రెండు సీన్ల షూటింగ్ పూర్తిచేశారు.

లాక్ డౌన్ ముగిసిన వెంటనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో ఉంటూ బాలయ్య సినిమా స్క్రిప్ట్ కు మరిన్ని మెరుగులు దిద్దానని చెబుతున్నాడు బోయపాటి.