ఆ డైరెక్టర్ తో బాలయ్య ... బోయపాటి తర్వాత ఇదే

Sunday,January 06,2019 - 01:52 by Z_CLU

ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హంగామా చేస్తున్న బాలయ్య మరో డైరెక్టర్ ని లైన్ పెట్టేసాడు. బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా ‘NTR కథానాయకుడు’ సినిమా ఈ నెల 9 న థియేటర్స్ లోకి రానుంది. ‘NTR మహానాయకుడు’ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వగానే బోయపాటి శ్రీను సినిమాను స్టార్ట్ చేయబోతున్న బాలయ్య లేటెస్ట్ గా అనిల్ రావిపూడితో మరో సినిమాను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కథ రెడీగా ఉండడంతో బోయపాటి సినిమాతో పాటే ఈ సినిమాను కూడా స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట బాలయ్య. అన్ని కుదిరితే ఈ సినిమాను కూడా NBK ఫిలిమ్స్ బ్యానర్ పై బాలయ్యే నిర్మించే ఛాన్స్ ఉందని సమాచారం.