బాలయ్య మొదలుపెట్టేశాడు .....

Tuesday,July 25,2017 - 04:09 by Z_CLU

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పైసా వసూల్’. పూరి జగన్నాథ్-బాలయ్య కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రెజెంట్ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా బాలయ్య సినిమాలతో ఓ వీడియోను రెడీ చేసి NBK101 ఫీవర్ బిగిన్స్ పేరుతో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసిన యూనిట్ లేటెస్ట్ గా ఈ వీడియో తో NBK101 ఫీవర్ స్టార్ట్ అంటూ ‘పైసా వసూల్’ స్టంపర్ ఈ నెల 28న రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. ఈ వీడియోతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన యూనిట్ స్టంపర్ పేరుతో ఓ టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఫైనల్ గా ‘పైసావసూల్’ కి సంబంధించి బాలయ్య ప్రమోషన్ షురూ చేసేశాడన్నమాట .