వెంకీ,వరుణ్ తేజ్ ల F2 లో బ్యాలన్స్ ఎలిమెంట్

Thursday,December 06,2018 - 12:01 by Z_CLU

టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది వెంకటేష్, వరుణ్ తేజ్ ల F2. కంప్లీట్ గా సినిమాకి ప్యాకప్ చెప్పాలంటే ఇంకా ఒకే ఒక్క పాట బ్యాలన్స్. మోస్ట్ హిలేరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ జనవరి 12.

రీఫ్రెషింగ్ హ్యూమర్ ని జెనెరేట్ చేయడం అనిల్ రావిపూడి స్పెషాలిటీ. అందుకే ఈ సినిమాలో కూడా మ్యాగ్జిమం హ్యూమర్స్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టిన అనిల్ రావిపూడి, ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ప్లాన్ చేయలేదట. ఫాస్ట్ పేజ్ లో జస్ట్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ప్యాకేజ్ లా రెడీ అవుతుంది F2. దానికి తోడు సినిమాలో సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉండబోయే స్పెషల్ సాంగ్, అనసూయను కన్సిడర్ చేస్తున్నారట మేకర్స్.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.