నవంబర్ 24న నారా రోహిత్ "బాలకృష్ణుడు" రిలీజ్

Friday,November 03,2017 - 10:01 by Z_CLU

నారా రోహిత్‌-రెజీనా జంటగా డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `బాల‌కృష్ణుడు`. ఈ సినిమా ఆడియో విడుదల, మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు. అలాగే చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన “బాలకృష్ణుడు” సినిమా ఫ‌స్ట్‌లుక్‌ కు విశేషమైన స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ లుక్ లో నారా రోహిత్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో వస్తున్నాడు `బాల‌కృష్ణుడు`

రెజీనాతో పాటు దీక్షాపంత్, పియా బాజ్ పాయ్, తేజశ్విని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలకపాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది.