ఈ టాప్ హీరో పాతికేళ్లు పూర్తిచేసుకున్నాడు

Monday,December 09,2019 - 06:18 by Z_CLU

బాలకృష్ణ కెరీర్ లో ఫ్యామిలీ హిట్స్ ఉన్నాయి, యాక్షన్ హిట్స్ ఉన్నాయి, కానీ ప్యూర్ గా మ్యూజికల్ హిట్ అయిన సినిమా ఒకటుంది. అదే టాప్ హీరో. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ్టితో పాతికేళ్లు పూర్తిచేసుకుంది. 1994, డిసెంబర్ 9న విడుదలైన ఈ సినిమాలో బాలయ్య సరసన సౌందర్య హీరోయిన్ గా నటించారు.

టాప్ హీరో సినిమాను ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఈ సినిమాలో పాటలు. అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి చాలా విభాగాలు చూసుకునేవారనే విషయం తెలిసిందే. అలా టాప్ హీరో సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, ఈ సినిమాకు సంగీతం అందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్.

అలా కథ, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా పెద్దగా మెప్పించకపోయినా.. పాటల పరంగా ఇది ట్రెండ్ సెట్ చేసింది.