రూలర్ టీజర్ రివ్యూ

Thursday,November 21,2019 - 05:54 by Z_CLU

ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటెనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను…. యూనిఫామ్ తీస్తే బయటికి వచ్చిన సింహంలా ఆగను… ఇక వేటే.

ఈ ఒక్క డైలాగ్ తో రూలర్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య సినిమా నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో సరిగ్గా అలానే ఉంది రూలర్ టీజర్. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ టీజర్ లో బాలయ్య డిఫరెంట్ గెటప్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన పాయింట్ తో వస్తోందనే విషయం టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. సంప్రదాయానికి భిన్నంగా కేవలం బాలయ్య లుక్, డైలాగ్స్, యాక్షన్ కే పరిమితం కాకుండా.. సినిమా థీమ్ ను ఎలివేట్ చేసేలా టీజర్ కట్ చేశారు.

హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో వేదిక, భూమిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 20న రూలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.