NBK 107 టైటిల్ చెప్పేది అప్పుడే ?

Thursday,September 15,2022 - 05:11 by Z_CLU

నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న NBK107 కి సంబంధించి ఇంకా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. ఇప్పటికే ‘పెద్దాయన’ , ‘అన్నగారు’ లాంటి టైటిల్స్ వినిపించాయి. ఫైనల్ గా ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ ఉంది. కానీ మేకర్స్ మాత్రం టైటిల్ పై ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అక్టోబర్ లో దసరా స్పెషల్ గా ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. ఆ టీజర్ తో సినిమా టైటిల్ ఏంటనేది చెప్పబోతున్నారని సమాచారం.  ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేసారనేది తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తుంది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది.