NBK107 బాలయ్య సినిమా లాంచ్ డీటెయిల్స్

Wednesday,November 10,2021 - 06:07 by Z_CLU

నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘NBK107’  సినిమాకి ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 13న 10:26 నిమిషాలకు ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అవ్వనుంది. హైదరాబాద్ లో మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో ఈ సినిమా ఓపెనింగ్ జరగనుంది. ఈ వేడుకకి కొందరు టాప్ డైరెక్టర్స్ తో ప్రముఖులు హాజరు కానున్నారు.

‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్యతో తెరకెక్కించనున్న ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ‘క్రాక్’ తరహాలోనే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నాడు గోపీచంద్.  సినిమాలో మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా యాక్షన్ డిజైన్ చేసారని తెలుస్తుంది.

ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసుకున్నారు. బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేశారు. మెయిన్ విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.  ‘అఖండ’ తర్వాత మళ్ళీ వెంటనే బాలయ్య -తమన్ కాంబో ఈ సినిమాతో రిపీట్ అవ్వనుంది.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics