అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణీ, బాలయ్యకి 100 వ చిత్రం. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ ఎక్స్ పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. నందమూరి నటసింహం సినిమా విషయంలో ఆ అంచనాల్ని మైండ్ లో పెట్టుకునే, క్రిష్ ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గరి నుండి ప్రతీది అటు హిస్టరీని, ఇటు బాలయ్య ఇమేజ్ ని బ్యాలన్స్ చేస్తూ సినిమా ప్లాన్ చేసుకున్నాడు.
అల్టిమేట్ లొకేషన్స్ : మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్ లాంటి లోకేషన్స్ ని ఎంచుకున్న క్రిష్, కథే కాదు టేకింగ్ విషయంలోనూ చారిత్రక ఆనవాళ్ళు కనిపించేలా సినిమాని తెరకెక్కించాడు.
యుద్ధం : ‘ శరణమా..? రణమా…’ అని టీజర్ లో బాలయ్య అడిగిన ప్రశ్నకి శతృ సమాధానం ఖచ్చితంగా రణమే. ఎందుకంటే GPS లో హైలెట్ గా నిలిచేది యుద్ధ సన్నివేశమే. రాజస్థాన్, మొరాకో, జార్జియా లాంటి సరికొత్త లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ యుద్ధ సన్నివేశాల కోసం బాలయ్య స్పెషల్ గా ట్రేనింగ్ కూడా తీసుకున్నాడు.
గౌతమీ పుత్రుని లుక్ : తెలుగు సినిమాలో రాజులంటే కిలోల కొద్దీ ఆభరణాలు, కనీసం తల కదపడానికి కూడా వీల్లేని పెద్ద కిరీటం. చూస్తుంటే క్రిష్ ఆ ఆచారానికి పెద్ద ఫుల్ స్టాపే పెట్టేశాడు. మెడ వరకు వాలే జుట్టుతో, బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ లో సరికొత్తగా కనిపిస్తున్న బాలయ్య లుక్ సినిమాకే కాదు.. బాలయ్య కరియర్ కే హైలెట్ గా నిలుస్తుంది.
సాంగ్స్ : బాలయ్య సినిమాలో డైలాగ్స్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, సాంగ్స్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. క్రిష్ ‘కంచె’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘చిరాంతన్ భట్’ ఈ సినిమాకి కూడా పని చేశాడు. డిసెంబర్ 16 న తిరుపతిలో ఆడియో లాంచ్ జరుపుకోనున్న GPS పాటలు, చరిత్రలో నిలిచిపోయిన గౌతమీ పుత్రునిలా సినిమా హిస్టరీ లోను నిలిచిపోవడం ఖాయం.