NBK 107 ఫస్ట్ హంట్ టీజర్ వస్తుంది

Tuesday,June 07,2022 - 05:06 by Z_CLU

Balakrishna’s First look from NBK107 on June 10th ?

ఇటివలే ‘అఖండ’తో భారీ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ  గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో NBK107 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ ఓ ప్రీ టీజర్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.

జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఆ రోజు బాలయ్య కి బర్త్ డే విషెస్ చెప్తూ ఫస్ట్ హంట్ అంటూ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మోషన్ పోస్టర్ కూడా వదలనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఒక లుక్ బయటికొచ్చేసింది. మరో లుక్ ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అఖండ తర్వాత బాలయ్య నుండి , క్రాక్ తర్వాత గోపీచంద్ నుండి వస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలున్నాయి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics