బాలయ్య US టూర్ బిగిన్ అయింది

Friday,January 20,2017 - 12:45 by Z_CLU

బాలయ్య US టూర్ బిగిన్ అయింది. హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణీ అవుట్ స్టాండింగ్  ఓపెనింగ్స్ తో బిగిన్ అయి, ఇప్పటికీ అదే క్రేజ్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఇండియాలో సినిమా రిలీజ్ కి సరిగ్గా వారం రోజుల ముందు నుండే ప్రమోషన్స్ లో పాల్గొన్న బాలయ్య ఇప్పుడు US లోను GPS ని ప్రమోట్ చేస్తున్నాడు.

ఈ టూర్ లో శ్రియ, క్రిష్ లతో పాల్గొంటున్న బాలయ్య, ఈ రోజు మ్యాగ్జిమం టైం బే ఏరియా మరియు  డల్లాస్ లోని అభిమానులతో స్పెండ్ చేయనున్నాడు. ఆ తరవాత వరసగా డెట్రాయిట్, న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా లోను ఫ్యాన్స్ ని మీట్ అవుతాడు.

బాలయ్య 100 వ చిత్రం అనగానే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా, క్రిష్ డైరెక్షన్ లో ఫ్యాన్స్ ని 100% మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయింది. తన వంద సినిమాల జర్నీకి ఇంత సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్పుకోనున్నాడు బాలయ్య.