Balakrishna Upcoming Movies - కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Wednesday,July 21,2021 - 06:30 by Z_CLU

Balakrishna Upcoming Movies Full details

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో స్పీడ్ పెంచబోతున్నాడు. అవును ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకునే బాలకృష్ణ నెక్స్ట్ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘అఖండ’ సినిమాను ఎండింగ్ కి తీసుకొచ్చిన బాలయ్య ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో సినిమా చేయనున్నాడు. అలాగే అనిల్ రావిపూడి మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలను ఒకే టైంలో ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా అలాగే హారికా హాసినీ సంస్థలో ఇంకో సినిమా కూడా లైన్లో పెట్టుకున్నాడు బాలయ్య. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా తెలియజేశాడు. వీటితో పాటు ‘ఆదిత్య369’ కి సీక్వెల్ గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ కూడా ఉంటుందని అది తన దర్శకత్వంలో రానుందని చెప్పుకున్నాడు. తన డైరెక్షన్ కోసం ఇంకో కథ కూడా రెడీ అవుతుందని రెండిటిలో ఏది ముందు చేస్తానో ఇంకా తెలియదని తెలిపాడు.

ఇక బాలయ్య -పూరి కాంబో సినిమా ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. ‘పైసా వసూల్’ తర్వాత వీరిద్దరూ ఇంకో సినిమా చేద్దామనుకున్నారు. ఇప్పటికి ఈ కాంబో మళ్ళీ కుదిరింది. బాలయ్య మాటలతో ఆ సినిమాపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక హారికా హాసినీ లో చేయబోయే సినిమాకు దర్శకుడు ఫిక్స్ అవ్వలేదని బాలయ్య చెప్పాడు. ఇక హారికా హాసినీ బేనర్ లో సినిమా అంటే దాన్ని త్రివిక్రమ్ టేకప్ చేస్తాడని ఆశించొచ్చు. సో.. బాలయ్య-త్రివిక్రమ్ కాంబో ఫిక్సయితే ఫ్యాన్స్ కి బాలయ్య నుండి ఓ ఫ్రెష్ సినిమా రావడం ఖాయం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics