బాలయ్య అప్ కమింగ్ మూవీస్

Monday,July 24,2017 - 10:09 by Z_CLU

ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు శ్రీకారం చుట్టే నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ పూరి తో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేసేశాడు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ‘పైసావసూల్’ సినిమాను ఫినిషింగ్ స్టేజి కి తీసుకొచ్చిన బాలయ్య త్వరలోనే కె.ఎస్.రవి కుమార్ తో ఓ సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు.


పూరి దర్శకత్వంలో మాఫియా బాగ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ సినిమాను ఆల్మోస్ట్ పూర్తి చేసేశాడు బాలయ్య. ఈ సినిమాలో పూరి మార్క్ హీరోయిజంతో సరికొత్త గా ఎంటర్టైన్ చేయబోతున్నాడట నందమూరి నటసింహం. బాలయ్య -పూరి కాంబినేషన్ అంటూ అనౌన్స్ చేసినప్పటి నుంచే క్యూరియాసిటీ నెలకొల్పిన ఈ సినిమాతో సెప్టెంబర్ ఎండింగ్ లో థియేటర్స్ లో సందడి చెయాయనున్నాడు బాలయ్య.

పూరితో చేస్తున్న ‘పైసావసూల్’ సినిమాను రిలీజ్ కి రెడీ చేసిన వెంటనే కె.ఎస్.రవి కుమార్ సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ‘జయసింహ’,’రూలర్’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు మేకర్స్. సి.కె ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించనున్నాడు.

కె.ఎస్.రవి కుమార్ సినిమాతో పాటు బాలయ్య లిస్ట్ లో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే టైటిల్ తో పొలిటికల్ డ్రామాను చేయబోతున్నట్లు ఆ మధ్య చెప్పిన బాలయ్య రీసెంట్ గా ఎన్టీఆర్ పై బయో పిక్ సినిమా కూడా అనౌన్స్ చేశాడు. సో ఈ సినిమాలతో ప్రెజెంట్ బాలయ్య డైరీ ఫుల్ అయిపోనుందన్నమాట.