#NBK108 బాలయ్య కి హీరోయిన్ ఫిక్స్ ?
Saturday,April 23,2022 - 11:02 by Z_CLU
Balakrishna to romance with Tamannaah in NBK108 ?
టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో నెక్స్ట్ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా జూన్ 10 న గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుందని తెలుస్తుంది. అదే నెలలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ గా తమన్నా ని ఫిక్స్ చేశారని టాక్ వినబడుతుంది.
బాలయ్య -తమన్నా కాంబో ఎప్పటి నుండో వార్తల్లో ఉంది. కొన్ని సినిమాలకు వీరిద్దరిని జంటగా అనుకున్నారు కానీ కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడు అనీల్ రావిపూడి ఈ క్రేజీ కాంబో సెట్ చేసినట్లు తెలుస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తమన్నా ‘F2’, ‘F3’ సినిమాల్లో నటించింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అందుకే తనకి లక్కీ చాంప్ గా భావిస్తూ అనిల్ మరోసారి తమన్నా ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడని , ఈ కాంబోకి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని త్వరలోనే ప్రాజెక్ట్ సైన్ చేయబోతుందని అంటున్నారు.
ప్రస్తుతానికి F3 రిలీజ్ హడావుడిలో ఉన్నాడు అనిల్ రావిపూడి. మే 27 న రిలీజ్ తర్వాత ఫ్రీ అయిపోతాడు. ఇక అప్పటి నుండి బాలయ్య సినిమా వర్క్ మొదలు పెడతాడు. లోకేషన్స్ , కాస్టింగ్ ఫైనల్ వగైరా పనులు మొదలు పెడతాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్ని కుదిరితే ఈ సినిమాతో మరోసారి బాలయ్య సంక్రాంతి పోటీలో నిలుస్తాడు.
* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics