బాలయ్య ఇలా చాలా రోజుల తరవాత...

Friday,August 09,2019 - 10:02 by Z_CLU

బాలయ్య ‘పింక్’ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..? ఇప్పటివరకు అఫీషియల్ గా ఎక్కడా కన్ఫమ్ కాలేదు. అలాగని సోషల్ మీడియాలో ఫైర్ జెనెరేట్ చేస్తున్న ఈ న్యూస్ ని ఎవరూ ఖండించడం కూడా లేదు. అందుకే హిందీలో అమితాబ్ బచ్చన్ ప్లే చేసిన రోల్ లో బాలయ్య బాబు నటిస్తున్నాడనే టాక్ రోజురోజుకి ఇంకా బలపడుతుంది.

గతంలో బాలయ్య రీమేక్స్ చేసి బ్లాక్ బస్టర్స్ జెనెరేట్ చేసిన సందర్భాలున్నాయి. ‘మంగమ్మ గారి మనవడు, ‘ముద్దుల మావయ్య, ‘ముద్దుల గోపాలుడు’ ,‘నిప్పులాంటి మనిషి’ ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య ఫిల్మోగ్రఫీ లో  ఇంట్రెస్టింగ్ లిస్టు దొరకుతుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో బాలయ్య అసలు రీమేక్స్ ఆలోచనకి కూడా దూరంగా ఉంటున్నాడు.

‘పింక్తెలుగు రీమేక్ రైట్స్ దిల్ రాజు దక్కించుకున్నాడు. అయితే నిజంగానే బాలయ్యని మేకర్స్ అప్రోచ్ అయ్యారా..? అయితే బాలయ్య రియాక్షన్ ఏంటి..? ఎగ్జాక్ట్ ‘పింక్’ సినిమా అంటే ఆలోచించాల్సిన విషయమే కానీ, తమిళ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ తరహాలో బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు చేంజెస్ చేసుకుంటే, ఈ సినిమా సక్సెస్ కి తెలుగులో చాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.

ప్రస్తుతం K.S. రవికుమార్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా తరవాత కూడా బాలయ్య చిన్న సిగ్నల్  ఇవ్వాలి కానీ ఇప్పటికే  క్యూ లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. మరి అలాంటప్పుడు బాలయ్య ఈ రీమేక్ కి ప్రిఫరెన్స్ ఇస్తాడా..? ఈ టాక్ జస్ట్ టాక్ లా మిగిలిపోతుందా..? లేకపోతే అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా..? చూడాలి.