బయోపిక్ కు బ్రేక్ ఇచ్చిన బాలయ్య

Thursday,November 15,2018 - 06:01 by Z_CLU

ఒకసారి సినిమా స్టార్ట్ చేస్తే దాన్ని పూర్తిచేసేవరకు అదే పనిలో ఉంటాడు బాలయ్య. తన ప్రతి సినిమాను రికార్డు టైమ్ లో పూర్తిచేయడం నటసింహం స్టయిల్. ఇంత గ్రాండ్ ట్రాక్ రికార్డు ఉన్న ఈ హీరో, ఎన్టీఆర్ బయోపిక్ కు మాత్రం బ్రేక్ ఇచ్చాడు. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి 10 రోజుల పాటు పక్కకు జరగబోతున్నాడు బాలకృష్ణ.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు.. ఈనెల 25 నుంచి బయోపిక్ కు శెలవుపెట్టాడు బాలయ్య. 10 రోజుల పాటు తెలంగాణలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని, తిరిగి వచ్చేనెల రెండో వారం నుంచి సెట్స్ పైకి రాబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సారథి స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు. చెన్నైలోని ఓ మార్కెట్ ను తలపించే సెట్ అది. తమిళ భాషలో బోర్డులు ఉన్న ఆ సెట్ లో ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులతో ధర్నాకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బాలయ్య లేని ఈ 10 రోజుల్లో, ఇలా అతడితో సంబంధం లేని సన్నివేశాల్ని కంప్లీట్ చేస్తారన్నమాట.