మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు?

Wednesday,June 10,2020 - 10:44 by Z_CLU

తన షష్టిపూర్తి సందర్భంగా దాదాపు ప్రతి ఇంటర్వ్యూలో బాలయ్య ఫేస్ చేస్తున్న క్వశ్చన్ ఇది. అయితే ఎప్పట్లానే ఈసారి కూడా బాలయ్య పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వలేదు.

“నేను విధిని నమ్ముతాను. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం చెప్పగలను. మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదిలో ఉండదు. వచ్చే ఏడాది కూడా వాడి ఎంట్రీ ఉండదు. వస్తాడు, ఇంకా టైమ్ ఉంది. అతడి కోసం కొన్ని బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ తీసి పెట్టాను.”

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీపై రియాక్ట్ అయ్యాడు బాలయ్య. నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే మంచి కథ దొరకాలన్నారు బాలయ్య. అలాంటి స్క్రిప్ట్ దొరికినప్పుడు తప్పకుండా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తానన్నారు.