బాలకృష్ణ పైసా వసూల్ అప్ డేట్స్

Tuesday,June 13,2017 - 09:05 by Z_CLU

పోర్చుగల్ లో భారీ షెడ్యూల్ నే ప్లాన్ చేసుకున్న ‘పైసా వసూల్’ సినిమా యూనిట్, సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. ఇంకో 2 రోజుల్లో ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనున్న సినిమా యూనిట్ జూన్ 16 న ఇండియాకి తిరిగి రానుంది.

హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా అదిరిపోయే లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ఫ్యాన్స్ లో ఫెస్టివ్ సీజన్ ని పట్టుకొచ్చింది. దానికి తోడు ఈ సినిమాలో సీనియర్ NTR సినిమా ‘జీవిత చక్రం’ సినిమాలోని ‘కంటి చూపు చెబుతోంది’ అనే సాంగ్ ని రీమేక్ చేయనున్నారనే టాక్ టాలీవుడ్ లో చిన్న సైజు వైబ్రేషన్ నే క్రియేట్ చేస్తుంది.

ఈ విషయంలో సినిమా యూనిట్ అయితే అఫీషియల్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే చేయలేదు కానీ, ఈ టాక్ నిజమైతే బావుంది అనే ఒపీనియన్ అయితే ఫ్యాన్స్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. మరి ఈ టాక్ జస్ట్ టాక్ గా మిగిలిపోతుందా..? లేక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ లా మారబోతుందా అనేది ఆడియో రిలీజ్ అయితే కానీ తెలీదు.