పోర్చుగల్ కు బాలయ్య

Sunday,May 07,2017 - 02:30 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తన 101వ సినిమా చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. 2 షెడ్యూల్స్ మాత్రం కంప్లీట్ అయ్యాయి. హైదరాబాద్ లోనే ఈ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. తాజాగా బాలయ్య, హీరోయిన్ ముస్కాన్ పై గోలీసోడా అంటూ సాగే ఓ మాస్ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు.

త్వరలోనే బాలయ్య సినిమాకు సంబంధించి ముచ్చటగా మూడో షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్ కోసం యూనిట్ అంతా పోర్చుగల్ వెళ్తున్నారు. ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్.. సుమారు 40 రోజుల పాటు సాగనుంది. సినిమాకు సంబంధించి కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు.. కొన్ని సాంగ్స్ పిక్చరైజ్ చేయబోతున్నారు.

పోర్చుగల్ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే వెంటనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. 10 రోజుల పాటు జరిగి ఏ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.