షాకింగ్.. బాలయ్య న్యూ లుక్

Monday,January 20,2020 - 05:34 by Z_CLU

సినిమాల్లో బాలయ్య గెటప్స్ కు కొదవ లేదు. ఒకే సినిమాలో 5-6 వేరియేషన్స్ చూపించిన అనుభవం కూడా బాలయ్యకు ఉంది. ఇప్పుడీ హీరో రియల్ లైఫ్ లో ఓ కొత్త గెటప్ లోకి మారారు. అవును.. ఒక్కసారిగా గుండులో కనిపించి అందరికీ షాకిచ్చారు బాలకృష్ణ.

ఇంత సడెన్ గా బాలయ్య ఈ లుక్ లోకి ఎందుకు మారారనేది అందర్లో ఆసక్తికరంగా మారింది. తన కొత్త సినిమా కోసమే బాలయ్య ఇలా గుండులోకి మారి ఉంటాడని చాలామంది అంటున్నారు. బోయపాటి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ హీరో. ఆ సినిమాలో ఓ పోర్షన్ కోసం బాలయ్య ఇలా గుండు కొట్టించుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.

నిజానికి బోయపాటి-బాలయ్య సినిమా ఇప్పటికే సెట్స్ పైకి రావాలి. కానీ మరికొన్ని మార్పుచేర్పుల వల్ల సెట్స్ పైకి రావడం ఆలస్యమౌతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.