బాలయ్య సినిమా టైటిల్ ఫిక్సయింది

Wednesday,June 07,2017 - 10:05 by Z_CLU

బాలయ్య 101 వ సినిమాకు టైటిల్ ఫిక్సయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో అల్టిమేట్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది సినిమా యూనిట్. నిన్న మొన్నటివరకు ఈ స్పేస్ లో ‘ఉస్తాద్’ అనే టైటిల్ వినిపించినా, అంతలో మరో ఇంటరెస్టింగ్ టైటిల్ తెరపైకి వచ్చింది.

బాలయ్య-పూరి సినిమాకు “జై బాలయ్య”  అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ పదం బాలయ్య ఫ్యాన్స్ లో చాలా పాపులర్. నటసింహానికి సంబంధించిన ఏ ఈవెంట్ లో అయినా జై బాలయ్య అనే నినాదం మారుమోగిపోవాల్సిందే. అందుకే అదే పేరును టైటిల్ గా పెట్టాలని అనుకుంటున్నాడట దర్శకుడు పూరి.

 

బాలకృష్ణ 101వ సినిమా టైటిల్ ను 9వ తేదీన ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఎనౌన్స్ చేయబోతున్నారు. అప్పటివరకు టైటిల్ పై ఈ సస్పెన్స్ తప్పదు. ఈ మూవీలో బాలయ్య సరసన శ్రియ, ముస్కాన్ హీరోయిన్లు.