షూటింగ్ పూర్తిచేసుకున్న ‘జై సింహా’

Thursday,December 28,2017 - 12:04 by Z_CLU

బాలయ్య 102వ సినిమా జై సింహా షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తిచేసి, నిన్నటితో ఈ సినిమాకు సంబంధించి గుమ్మడికాయ కొట్టేశారు. ఈ ఫంక్షన్ లో బాలయ్య కూడా పాల్గొన్నాడు. షూటింగ్ తో పాటు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనలు కూడా దాదాపు పూర్తయ్యాయి.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై సింహా సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. నయనతార మెయిన్ హీరోయిన్ గా నటించగా.. నటాషా, హరిప్రియ కూడా హీరోయిన్లుగా చేశారు. సినిమాలో మరో కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.

మూవీకి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేశారు. అదే రోజు థియేట్రికల్ ట్రయిలర్ కూడా తీసుకొచ్చారు. త్వరలోనే మూవీకి సంబంధించి డైలాగ్స్, సాంగ్ బిట్స్ ను విడుదల చేయబోతున్నారు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి చిరాంతన్ భట్ సంగీత దర్శకుడు.