బిజీ బిజీ బాలయ్య

Sunday,July 23,2017 - 11:07 by Z_CLU

బాలయ్య పైసా వసూల్ రిలీజ్ కి ముందే వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ లోపు బాలయ్య K.S. రవి కుమార్ సినిమాకి రెడీ అయిపోయాడు. ఈ సినిమా ఆగష్టు 3 రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. C. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార నటిస్తుంది.

గౌతమీ పుత్ర శాతకర్ణీ తరవాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తీసుకు వస్తున్న బాలయ్య, ఓ సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘జయసింహ’, ‘రూలర్’ లాంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

సింహ, శ్రీరామ రాజ్యం తరవాత బాలయ్యతో మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది నయనతార. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో, ఇటు స్టార్ సినిమాలతో బిజీ బిజీ ఉన్న నయన్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనునట్టు తెలుస్తుంది.