అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య

Wednesday,September 26,2018 - 10:05 by Z_CLU

ప్రస్తుతం NTR బయోపిక్ తో బిజీగా ఉన్నాడు బాలయ్య. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే బాలయ్య నెక్స్ట్ సినిమాపై టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ, వరుణ్ తేజ్ తో ‘F2’ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకి డైరెక్టర్ అని తెలుస్తుంది.

ఈ సినిమా గురించి ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, రీసెంట్ గా బాలయ్యకు అనిల్ రావిపూడి ఓ స్టోరీలైన్ చెప్పడం, దానికి బాలకృష్ణ ఇంప్రెస్ అయి సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడన్న విషయం టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కనుందట.

ప్రస్తుతం హయ్యెస్ట్ సక్సెస్ రేట్ తో ఫామ్ లో ఉన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకడు. అందుకే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబో సెట్స్ పైకి వస్తే మరో ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే టాక్ అప్పుడే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ టాక్ జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందా..? లేకపోతే అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.