ఈసారి బాలయ్య హీరోయిన్ ఎవరు?

Friday,December 13,2019 - 09:02 by Z_CLU

ఊహించని హీరోయిన్లను తెరపైకి తీసుకురావడం బాలయ్య స్టయిల్. పనిలోపనిగా హీరోయిన్లకు రిపీట్ చేయడంలో కూడా బాలయ్యకు రికార్డ్ ఉంది. ఎప్పుడు ఏ ముద్దుగుమ్మకు అవకాశం ఇస్తాడో తెలీదు. ఈసారి కూడా అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది. బోయపాటితో సినిమా లాంఛ్ చేశాడు నటసింహం. ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది.

బాలయ్య-త్రిష
ఈ కాంబో ఆడియన్స్ కు కొత్త కాదు. లయన్ సినిమాలో బాలయ్య సరసన మెరిసింది త్రిష. ఈమెను మరోసారి రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రస్తుతం తమిళ్ లో యమ బిజీగా ఉన్న త్రిష, ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తుందా అనేది చూడాలి. పైగా చిరంజీవి సినిమాలో కూడా ఈమెను హీరోయిన్ గా తీసుకున్నారు.

బాలయ్య-శ్రియ
బాలయ్య సినిమాలో ఆఫర్ అంటే శ్రియ ఎప్పుడూ రెడీ. మినిమం గ్యాప్స్ లో బాలయ్య సరసన ఈ ముద్దుగుమ్మ కనిపిస్తూనే ఉంది. తాజాగా పైసావసూల్ లో నటసింహంతో కలిసి నటించిన శ్రియ.. కొత్త సినిమా హీరోయిన్ రేసులో కూడా ముందుంది.

బాలయ్య-సోనాల్ చౌహాన్
తన సినిమా ఏదైనా ఈమధ్య బాలయ్య రెగ్యులర్ గా రిపీట్ చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్. రిలీజ్ కు రెడీ అయిన రూలర్ లో కూడా ఈమె ఉంది. బోయపాటి సినిమాలో కూడా సెకెండ్ హీరోయిన్ గా ఈమెను తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.

బాలయ్య-నయనతార
ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా లాంటి సినిమాలొచ్చాయి. నయనతార ఓకే అనాలే కానీ ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి బాలయ్య ఎప్పుడూ రెడీ. కాకపోతే నిర్మాతకు మాత్రం బడ్జెట్ పెరుగుతుంది.

బాలయ్య-కీర్తిసురేష్
ఎవరూ ఊహించని కాంబినేషన్. పైగా ఇప్పుడు ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తున్న గాసిప్ కూడా. అవును.. స్టోరీ ప్రకారం, ఈ సినిమాలో కీర్తిసురేష్ అయితే బాగుంటుందని బోయపాటి గట్టిగా ఫీల్ అవుతున్నాడట. కీర్తి ఒప్పుకుంటుందా అనేది క్వశ్చన్ మార్క్.

వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది బాలయ్య-బోయపాటి సినిమా. సో.. మరో 2 వారాల్లో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తేలిపోతుంది.