బాలయ్య తమిళ GPS ఆడియో రిలీజ్ డేట్

Wednesday,June 28,2017 - 12:39 by Z_CLU

బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తమిళంలో రిలీజ్ కి రెడీ అవుతుంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసిన యూనిట్, జూలై 1 న తమిళ ఆడియోను మార్కెట్లోకి తీసుకురానుంది. తెలుగు జాతి కీర్తిని ఖండాంతరాలు గుర్తించేలా పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సూపర్ హిట్ ఎంటర్ టైనర్ తమిళంలోనూ హిట్ అవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి చిరాంతన్ భట్ మ్యూజిక్ డైరక్టర్. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని నటించారు.