Balakrishna - ముహూర్తం ఫిక్స్ చేసిన నటసింహం

Monday,June 07,2021 - 08:01 by Z_CLU

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. అవును సినిమా విడుదలకి ముహూర్తం ఖరారు చేసారట బాలయ్య. బాలయ్య డ్యుయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా దసరా కానుకగా థియేటర్స్ లోకి రాబోతుందని సమాచారం. ఈ మేరకూ రిలీజ్ కి సంబంధించి ప్రమోషన్ ప్లానింగ్ కూడా రెడీ అవుతుందట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ లోనే సినిమా థియేటర్స్ లోకి రావాల్సి ఉంది.

కరోన సెకండ్ వేవ్ ప్రభావం వల్ల సినిమా రిలీజ్ వరకూ వచ్చి వాయిదా పడింది. ఇప్పుడు దసరా డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫెస్టివల్ సీజన్ పైగా అప్పటి కల్లా పరిస్థితి సాధారణ స్థితికి రావడం ఖాయమని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక బాలయ్య కి సంక్రాంతితో పాటు దసరా కూడా ఓ సెంటిమెంటే. అందుకే విజయ దశమి కి ముహూర్తం పెట్టారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ను బాలయ్య పుట్టిన రోజు నాడు పోస్టర్ తో ప్రకటించనున్నారట మేకర్స్.

akhanda movie balakrishna

ద్వారక క్రియేషన్స్ బేనర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన పూర్ణ , ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో బాలయ్య అఘోర పాత్ర తాలూకు సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని ఇన్సైడ్ టాక్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics