బాలకృష్ణ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్-2

Tuesday,January 10,2017 - 04:47 by Z_CLU

*ఈ పాత్రలన్నీ నాకు పరీక్షే

నేనిప్పటి వరకు చేసిన పాత్రలన్నీ నాకు పరీక్షే. నాన్నగారు చేసిన పాత్రలు కూడా అలాంటివే. ఆయన పాత్రల కోసం డిజైన్ చేసిన దుస్తులు, నగలు భద్రంగా దాచడం జరిగింది. బహుశా ఇలాంటి పాత్రల కోసమే ఆయన ఉంచారేమో అనిపిస్తుంది.

*భావితరాలకు అందించడం మా బాధ్యత    

ఎక్కడ కోటిలింగాలు, ఎక్కడ అమరావతి..? అమరావతి, శ్రీకాకుళం కాశీ లాంటి ఎన్నో ప్రాంతాలను శాతకర్ణి మహారాజు పరిపాలించారు. అలాంటి అద్భుత చరిత్ర భావితరాలకు ఇలాంటి సినిమాల ద్వారా అందించడం మన బాధ్యత.

*అద్భుతాలు జరిగాయి

ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు వర్షం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా కోసం ఎన్ని లొకేషన్స్ లో షూట్ చేసినా, మాకు కావాల్సినపుడల్లా వర్షం కురిసేది. పంచభూతాలు ఈ సినిమా కోసం సహకరిస్తున్నాయా అనిపించేది.

gpsk-117

*నా ఆవేశం వాళ్లకు తెలుసు

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లకి నా ఆవేశం గురించి బాగా తెలుసు. గతంలో కూడా రోప్ లేకుండా ఫైట్స్ చేసేవాణ్ని. గ్రాఫిక్స్ చేసేద్దాం అని వారంటున్నా… నేనే ఆ సీన్స్ ని నేచురల్ గా చేసేవాడ్ని. ఈ సినిమాలో కూడా అలాగే చేశాను. చాలా సీన్స్ లో గ్రాఫిక్స్ చేయడానికి అవకాశం ఉన్నా నేనే రియల్ గా చేశాను.

*సినిమాల మధ్య పోటీ ఉంది

సినిమాల మధ్య పోటీ లేదు అంటే ఎలా..? ఉంది. సినిమా సినిమాకి పోటీ ఉంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ బాగా ఆడి, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.

*ఆయన లేకపోతే ఆ సినిమా ఉండదు

రైతు సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు చేయల్సిన పాత్ర ఉంది. నిజం చెప్పాలంటే ఆ పాత్ర చేయడానికి ఆయన ఒప్పుకుంటేనే ఈ సినిమా ఉంటుంది. కృష్ణవంశీ ఆల్రెడీ ఆయన్ని ఒప్పించే పనిలోనే ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో…

gpsk-61

*అన్ని రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం

గౌతమీపుత్ర శాతకర్ణి నాగత సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేయడం ఖాయం. స్పెషల్ థాంక్స్ టు సాయి మాధవ్ బుర్రా గారు. వండర్ ఫుల్ డైలాగ్స్ రాశారు.

*ఇకపై కొత్త  బాలకృష్ణ

ఈ సినిమా తరవాత కొత్తరకం బాలకృష్ణను చూస్తారు. శాతకర్ణి తర్వాత వచ్చే నా ప్రతి సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా తరవాత నా కరియర్ లో కొత్త శకం మొదలవుతుంది.

*దీక్షలా చేశారు

ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకువచ్చిన నిర్మాతల సంకల్పం గొప్పది. ఒక మంచి చరిత్రని గొప్పగా తెరకెక్కించాలన్న దీక్షతో నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు. వాళ్లకు థ్యాంక్స్.