కరోనాపై పోరాటానికి బాలయ్య సహాయం

Friday,April 03,2020 - 12:08 by Z_CLU

కరోనా కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ పూర్తిగా షట్ డౌన్ అయింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు బాలకృష్ణ.

ఈ మొత్తంలో 50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, మిగతా మొత్తాన్ని లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సినీకార్మికుల సంక్షేమానికి బాలయ్య కేటాయించారు.

సినీకార్మికుల కోసం కేటాయించిన 25 లక్షల రూపాయల చెక్కును సీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి.కల్యాణ్ కు అందించారు బాలయ్య. అందరూ ఇళ్లలోనే ఉండి కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.