బాలయ్య బోయపాటి మూవీ లాంఛ్

Friday,December 06,2019 - 04:22 by Z_CLU

సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బాలయ్య-బోయపాటి జోడీ మరోసారి కలిసింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా లాంఛ్ అయింది. ముహూర్తపు షాట్ కు బి.గోపాల్ క్లాప్ కొట్టగా, అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేశారు.

బాలయ్య-బోయపాటి సినిమాలంటే డైలాగ్స్ తూటాల్లా పేలుతాయనే విషయం తెలిసిందే. ఈ కొత్త సినిమాకైతే ముహూర్తం షాట్ నుంచే ఆ తూటాలు పేలాయి. ‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం‘’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను ముహూర్తం షాట్ లోనే బాలయ్య చెప్పి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు.

సినిమాకు ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న రూలర్ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వస్తుంది.