Balakrishna B Gopal Movie - ఈ మూవీ ఎందుకు ఆగింది

Thursday,October 07,2021 - 05:00 by Z_CLU

టాలీవుడ్ చరిత్రలో రికార్డులు తిరగరాసిన సినిమాల వెనుక ఉన్న దర్శకుడు B గోపాల్ (Director B Gopal) కొన్నేళ్లుగా డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం ఆయన డైరెక్ట్ చేసిన ‘ఆరడుగుల బుల్లెట్టు‘ (Aaradugula Bullet) రేపే థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా ఆయన తన నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పటి నుండో బాలకృష్ణ -గోపాల్ కాంబో సినిమా ప్రచారం లో ఉంది. ఓ సందర్భంలో బాలయ్య కూడా గోపాల్ తో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.

balakrishna samarasimha reddy zeecinemalu

అయితే ఈ కాంబో సినిమా ఎప్పుడు ఉంటుంది ? కథ ఫైనల్ అయ్యిందా ? అనే డౌట్స్ మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. వీటికి ఇటివలే సమాధానం ఇచ్చారు దర్శకుడు B గోపాల్. త్వరలోనే బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నాను. అదే నా కం బ్యాక్ ఫిలిం అవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఇంకా కథ సెట్ అవ్వలేదని కథ కుదరగానే బాలకృష్ణ గారికి నెరేట్ చేసి తమ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేస్తానని చెప్పుకున్నారు సీనియర్ డైరెక్టర్.

బాలకృష్ణ -B గోపాల్ కాంబినేషన్ (Balakrishna B Gopal)లో ఇప్పటి వరకు 4 సినిమాలు వచ్చాయి. వాటిలో ‘లారీ డ్రైవర్’ , సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ పెద్ద హిట్స్ సాధించాయి. ఈ కాంబోలో వచ్చిన చివరి సినిమా ‘పల్నాటి బ్రహ్మ నాయుడు’ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబో నుండి ఓ సినిమా రానుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబో సినిమా మెటీరియలైజ్ అయ్యేదెప్పుడో చూడాలి.

ఇక OTT గురించి కూడా సీనియర్ డైరెక్టర్ ఓపెన్ అయ్యాడు. OTT అనే మార్పు ని మనం యాక్సెప్ట్ చేయాలని అడ్జస్ట్ అవ్వక తప్పదని కూడా చెప్పారు. థియేటర్స్ కోసం తను సినిమాలు తీస్తానని OTT కోసం సినిమా చేసే ఆలోచన లేదని ఆయన అన్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics