Balakrishna Akhanda - టైటిల్ తో పాటు టీజర్ కూడా

Tuesday,April 13,2021 - 01:59 by Z_CLU

సినిమాలో బాలకృష్ణ అఘోర గెటప్ లో కనిపిస్తాడా ? … ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య -బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేశారు? ఇవి నిన్నటి వరకూ BB3 సినిమా చుట్టూ చక్కర్లు కొట్టిన ప్రశ్నలు. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వీటన్నిటికి పోస్టర్ , టీజర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సినిమాకు ‘అఖండ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫైనల్ చేసి ఎనౌన్స్ చేశారు.

సినిమాలో బాలయ్య అఘోర గెటప్ లో కనిపించనున్నాడనే విషయన్ని తెలియజేస్తూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఇప్పటికే పంచెకట్టులో బాలయ్య మాస్ లుక్ రివిల్ చేసి టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన బోయపాటి తాజాగా అఘోర లుక్ తో మరో టీజర్ రిలీజ్ వదిలి బాలయ్య సినిమాలో రెండు విభిన్న గెటప్స్ లో కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చాడు.

సింహా , లెజెండ్ సినిమాల్లో బాలయ్య కోసం రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బోయపాటి ఈసారి ఈ సినిమాలో కూడా రెండు పవర్ ఫుల్ రోల్స్ తో నందమూరి అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు.

akhanda movie balakrishna 2

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెల  28న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య సరసన పూర్ణ , ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.