62 గెటప్పుల్లో బాలయ్య

Monday,January 08,2018 - 01:01 by Z_CLU

జై సింహా థియేటర్లలోకి వచ్చిన వెంటనే కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు బాలయ్య. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను బయటపెట్టాడు. ఈ బయోపిక్ లో తండ్రిలా కనిపించేందుకు ఏకంగా 62 గెటప్పుల్లోకి మారబోతున్నాడు నటసింహం.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను బయటపెట్టాడు బాలయ్య. ఎన్టీఆర్ జీవిత చరిత్ర మొత్తం ఆవిష్కరించేలా బయోపిక్ ఉంటుందని ప్రకటించిన బాలయ్య… ఎన్టీఆర్ చైల్డ్ హుడ్ నుంచి అతని జీవితంలో ప్రతి మలుపును బయోపిక్ లో చూపిస్తామని తెలిపాడు.

ఈ బయోపిక్ కు సంబంధించి తాజాగా టీజర్ షూటింగ్ కూడా జరిగింది. 2 రోజుల పాటు ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు బాలయ్య. ఈనెల 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.